ప్రధానిగా మోదీ రికార్డ్… చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన.

0
2

మోదీ రికార్డుపై చంద్రబాబు, లోకేశ్ ప్రశంసలు

సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ చారిత్రక మైలురాయిని అందుకున్న నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ గతిని మార్చిన గొప్ప నేత మోదీ అని చంద్రబాబు కొనియాడారు. సామాన్యుడి సంక్షేమం నుంచి చంద్రయాన్ విజయం వరకు ప్రతి అంశంలోనూ మోదీ ముద్ర ఉందని, ‘వికసిత భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ‘స్వర్ణాంధ్ర’ను నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తొలి ప్రధాని నెహ్రూ రికార్డును అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అజేయశక్తిగా, స్వావలంబన దిశగా నిలిచిందని ఆయన కొనియాడారు.