బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.

0
2

మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా (32) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్‌పై రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా.

పెంచుపాడు కృష్ణాపురం వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.