మదనపల్లెలో ఘనంగా మెగా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్-2K26|

0
0

మదనపల్లెలో ఘనంగా రాష్ట్ర స్థాయి మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ – పాల్గొన్న కట్టా దొరస్వామి నాయుడు

 

మదనపల్లె: నిరుగట్టువారిపల్లి ఓల్డ్ బైపాస్ సమీపంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం రాష్ట్ర స్థాయి “మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26” వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.

 

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జాతిని జాగృతం చేసేదే కళ. కళలకు సమాజాన్ని చైతన్యపరిచే శక్తి ఉంది.

 

యువత తమ ప్రతిభను వెలికితీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఇలాంటి రాష్ట్ర స్థాయి వేదికలు ఎంతగానో దోహదపడతాయి.

 

కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” అని అన్నారు. అనంతరం ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జిత్తు మాస్టర్ మాట్లాడుతూ, “డ్యాన్స్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.

 

అది క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో కూడిన కళ. ప్రతి పోటీదారుడు విజయం కోసం కాకుండా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలి.