కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వీరెడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన జ్యోతి (32)పై ఆమె భర్త దావీదు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఘటనపై సమాచారం అందుకున్న కొమరోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది










