పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో, భూపతి మరియు మోహిత్ అనే తండ్రీకొడుకులు తమ సేవ దృక్పథాన్ని చాటుకున్నారు.
సిఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన రెండు లారీలను హిటాచి సహాయంతో రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులను ప్రశంసించి, అభినందించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.









