ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు.

0
0

విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరుకు బదిలీ అవుతున్న ఆర్. ఐ వి. జె. రామకృష్ణకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో పనిచేసిన రామకృష్ణ జిల్లాలో అద్భుత సేవలు అందించారని, బందోబస్తుల సమయంలో ఆయన చూపిన కఠినత్వం కేవలం ఉద్యోగ ధర్మమేనని ఎస్పీ కొనియాడారు