తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్: దోషి క్షమాభిక్ష పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు!

0
2

ట్రిపుల్ మర్డర్ కేసు: దోషికి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు

తూర్పు గోదావరి జిల్లాలో 2015లో ముగ్గురిని దారుణంగా హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఏడిద ఆనందకుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను విడుదల చేయాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా.

జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం కొట్టివేసింది. తాను ‘బైపోలార్ డిజార్డర్’తో బాధపడుతున్నానన్న దోషి వాదనను కోర్టు తోసిపుచ్చింది. గతంలోనే ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి, బయటకు వచ్చాక మళ్లీ ముగ్గురిని చంపిన నేర చరిత్ర ఉన్నందున అతడు క్షమాభిక్షకు అర్హుడు కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది