భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.

0
0

భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

భూమి యాజమాన్య వివాదాల సాకుతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను తేల్చే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉంటుందని జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి తీర్పునిచ్చారు.

నంద్యాల జిల్లాకు చెందిన కె. జమాల్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడో పక్షం ఇచ్చిన లీగల్ నోటీసును ప్రాతిపదికగా తీసుకుని నిర్మాణ అనుమతిని తిరస్కరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. దరఖాస్తుదారుడి స్వాధీనం, టైటిల్‌ను మాత్రమే పంచాయతీలు పరిశీలించాలని సూచిస్తూ.. 15 రోజుల్లోగా పిటిషనర్ దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది.