ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ‘మన మిత్ర’ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా అన్ని ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో మాట్లాడిన ఆయన.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
తాగునీటి నాణ్యత పరిశీలన, గంజాయి సాగు నిర్మూలన, మహిళలపై నేరాల అణచివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సాంకేతికత ఆధారంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన ఆర్టీజీఎస్ పాలనా విధానాలను త్వరలోనే జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రానికి వివరించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.










