ఏపీఎల్-2026 ప్రారంభం: తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్ నిరాడంబరంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ.. యువ బ్యాటర్ యువన్ అజేయ హాఫ్ సెంచరీతో 219 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్.. కాకినాడ బౌలర్ ఆంజనేయులు (3 వికెట్లు) ధాటికి 148 పరుగులకే ఆలౌట్ అయింది. యువన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.










