రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి జిల్లా ఎస్పీ నితికా పంత్

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐ.పి.ఎస్  గారు పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ (Arrive Alive) ప్రచారంలో భాగంగా బుధవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడటం మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అనంతరం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను స్క్రీన్‌పై ప్రదర్శించి అవగాహన కల్పించగా, కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధికారులు అంతా కలిసి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.