స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి ఇవ్వాలి: జగన్ డిమాండ్

0
0

స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి ఇవ్వాలి: జగన్ డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.

బీమా, పీఎఫ్ వంటి చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని జగన్ తప్పుబట్టారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల సాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కూటమి ప్రభుత్వం స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఈ హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.