మంత్రి లోకేశ్ ఓఎస్డీకి రెండు స్వర్ణ పతకాలు
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన పీహెచ్డీ పరిశోధనకు గాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) రెండు స్వర్ణ పతకాలను ప్రకటించింది. ఎస్వీయూ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాలను అందుకున్నారు.
ఆయనకు ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్’, ‘ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ గోల్డ్ మెడల్’ లభించాయి. మున్సిపల్ బాండ్ల ద్వారా మౌలిక సదుపాయాల నిధుల సమీకరణపై ఆయన పరిశోధన చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసరైన ఆయన, గతంలో సీఎంఓలోనూ పనిచేశారు.










