ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం

0
5

రాజ్యసభ సభ్యులతో మంత్రి లోకేశ్ భేటీ

రాష్ట్రం నుండి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలు చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణలకు ఆయన అభినందనలు తెలిపారు. పార్లమెంటులో ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించాలని ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని కోరారు. ఎంపీల పదవీకాలం విజయవంతంగా సాగాలని, రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా వారు పనిచేస్తారని లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.