అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం మదనపల్లె మండలం వలసపల్లె క్వారీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బైరటీస్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, వైట్ కలర్ గ్రానైట్ వంటి ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఈ ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని, వడ్డెర సామాజికవర్గానికి క్వారీ లీజుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు.










