స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ.

0
5

స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్లాంట్ భూములను అమ్మి నిధులు సమీకరించాలని, ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకోవాలని జగన్ కేంద్రానికి లేఖలు రాశారని ఆయన విమర్శించారు.

జగన్ హయాంలో ఉత్పత్తి సామర్థ్యం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయాయని.. కూటమి ప్రభుత్వం వచ్చాక లీజులను పొడిగించి ప్లాంట్‌ను మళ్లీ లాభాల్లోకి తెచ్చిందని పట్టాభి తెలిపారు. జగన్ రాసిన లేఖలే ఆయన వైఖరికి నిదర్శనమన్నారు.