100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.

0
2

మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మంచినీటి బావి, రెండు చింత చెట్లను గ్రామస్థులకు తెలియకుండా రూ. 2. 35 లక్షలకు విక్రయించారని గిడ్డ రామచంద్ర గురువారం ఆరోపించారు.

ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదమని కోర్టును ఆశ్రయించాలని సూచించారని చెప్పారు. దీంతో గురువారం మదనపల్లె కోర్టులో అర్జీ సమర్పించి న్యాయం చేయాలని కోరారు.