కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.

0
5

సొంత నిధులతో కార్యకర్తలకు ఇళ్లు కట్టించిన కేంద్రమంత్రి వర్మ

తన గెలుపు కోసం శ్రమించిన ఇద్దరు సామాన్య బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ అండగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన కరోనా బాధితుడు లక్ష్మీనరసింహ, సీనియర్ కార్యకర్త రామారావు కుటుంబాల దీనస్థితిని చూసి చలించిన ఆయన, తన సొంత నిధులు రూ.40 లక్షలతో రెండు ఇళ్లను నిర్మిస్తున్నారు.

ఇటీవల కొండేపూడిలో రామారావు ఇంటి శ్లాబ్ పనుల్లో మంత్రి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలను బీజేపీ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.