మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, 13.5×25 అడుగుల ఇంటిని కొనుగోలు చేసి, మున్సిపల్ అనుమతితో కొత్త నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
అయితే, ఇంటి వెనుక నివసిస్తున్న శ్రీనివాసులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఆస్తిని రక్షించి న్యాయం చేయాలని స్వర్ణలత కోరారు.










