శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో రూ.60 లక్షల అక్రమ వసూళ్లు

0
5

శాయంపేట మక్కల కేంద్రంలో భారీ దోపిడీ

హన్మకొండ జిల్లా శాయంపేట మొక్కజొన్న (మక్కల) కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి బస్తాకు రూ.30 నుండి రూ.40 వరకు అక్రమంగా వసూలు చేస్తూ భారీ మోసానికి తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంటా అయిన తర్వాత బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, లారీ ఎక్కించాలంటే అదనపు డబ్బులు ఇవ్వాల్సిందేనని PACS నిర్వాహకులు రైతులను వేధించారు.

మండలంలో దాదాపు 2 లక్షలకు పైగా బస్తాల కొనుగోలు జరగ్గా.. హమాలీ ఛార్జీల పేరుతో రైతుల నుండి రూ.60 లక్షల నుండి రూ.70 లక్షల వరకు అక్రమంగా దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.