భూకబ్జాదారులను అడ్డుకున్నందుకే నాపై కేసులు: రంగనాథ్|

0
4

గత రెండేళ్లలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తితో రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడానని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆరు చెరువులు పునరుద్ధరించామని, మరో 20 పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, సామాన్యుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన శాంతా శ్రీరామ్, సంధ్యా శ్రీధర్ రావు లాంటి బడా భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియాను అడ్డుకున్నందుకే తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు వేశారని ఆయన తెలిపారు. ఈ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా వంద శాతం చిత్తశుద్ధితో, నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని రంగనాథ్ స్పష్టం చేశారు.