అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండల తర్వాత, ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది.
మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం కారణంగా చిరు వ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు.










