మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు,డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను పంపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు భట్టి పేర్కొన్నారు,వ్యాపారుల సహకారం బాగుందని అన్నారు,అనంతరం డిప్యూటీ సీఎంని, మంత్రి ని, ఎమ్మెల్యేని శాలువాలతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి , ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ సుధాకర్ , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










