కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు.

0
0

అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు, అరటిపండ్లు, చికెన్ సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ శుక్రవారం తెలిపారు.

దరఖాస్తు ఫీజుగా రూ. 5 వేల డీడీ, బిడ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 50 వేల డీడీ సమర్పించాల్సి ఉంటుందని, ఈ నెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జూన్ 22న జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను తెరవనున్నట్లు వెల్లడించారు.