శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు

0
0

అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి మరియు శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా శనివారం జరిగాయి.

ఆలయ పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, నవగ్రహాలకు తైలాభిషేకాలు, పుష్పార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.