ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఈనెల 15న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రక్త నిల్వ కేంద్ర మెడికల్ ఆఫీసర్ దేవరకొండ భార్గవ్ తెలిపారు.
రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.










