బోయకొండలో చండీ హోమం

0
0

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య సందర్భముగా చండీ హోమం నిర్వహించారు.

ఈ చండీ హోమములో ఇద్దరు దంపతులు పాల్గొని వారి అభీష్ట సిద్ధి కొరకు హోమాన్ని నిర్వహించారు వీరికి దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి ఏకాంబరం అమ్మవారి దర్శనము కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.