ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణమ నాయుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు మౌనిక, ఉమ ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు.
పురిటి బిడ్డలతో సహా తమ కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తులను కాజేశారని, కుటుంబాల్లో కలహాలు సృష్టించి భార్యాభర్తలను విడదీసేలా చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.










