మదనపల్లి: ఉత్సాహంగా పోలీసుల సైకిల్ ర్యాలీ.

0
0

పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో మదనపల్లెలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ జరిగింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బి. సెంట్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సైక్లింగ్, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని పోలీసులు సూచించారు.