ఇందూరు నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, గోదాం రోడ్, బస్టాండ్ తదితర కాలనీలను మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గారు, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ గారితో కలిసి సందర్శించి, ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీ మరియు మంచినీటి సరఫరా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అలాగే, అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించడం జరిగింది.ముఖ్యంగా గాంధీగంజ్ కమాన్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది.










