🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, లాకప్ రూమ్, రిసెప్షన్, రికార్డులను పరిశీలించిన ఆమె, విధి నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అక్రమ రవాణా.
డ్రగ్స్ వంటి వాటిపై నిఘా పెట్టాలని, రాత్రిపూట పెట్రోలింగ్ మరియు పిక్కెటింగ్ను కచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే, స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, మహిళలు మరియు బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.










