మదనపల్లె అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సీపీఐ.|

0
2

జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా జలాలతో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్డు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని కోరారు.

మదనపల్లె–రామసముద్రం రహదారిని విస్తరించి, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు