శాయంపేట మండలంలోనీ మైలారం గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీ గౌరవ అధ్యక్షులుగా జూలూరు చంద్రశేఖర్, అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మామిడిపల్లి సాంబయ్య, జోగిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా దూదిపాల రాంరెడ్డి, నూనె శ్రీనివాస్, కోశాధికారిగా బత్తిని తిరుపతి, సలహాదారుగా సలేంద్ర రవీంద్రా చారి మరియు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర స్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసి, రాబోయే ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










