శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.అనంతరం గోవిందాపూర్ సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల మరియు ఇతర మౌళిక వసతులకోసం చేపట్టబోయే పనులకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా, వైద్యం, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా పాటుబడుతుందని అని .
గురుకుల పాఠశాలల విద్యార్థులకు గతంలో లేని విధంగా మెస్ ఛార్జీలు పెంచి,వారి వ్యక్తిగత పరిశుభ్రత కోసం కాస్మొటిక్ చార్జీలను గణనీయంగా పెంచి వారి ఖాతాలోనే వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.38 లక్షల రూపాయలతో విద్యాలయంలో అధునాతన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేసి,క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచిస్తూ,విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని , ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,నాయకులు పాల్గొన్నారు.










