బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.|

0
2

బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం రాత్రి ఏర్పాట్లు జోరుగా సాగాయి. “మన ఊరి అజెండా” అన్నమయ్య జిల్లా కో-కన్వీనర్లు వరదా రెడ్డి, నారద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభా ప్రాంగణంలో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లు చేపడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు.