ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

0
1

నవంబర్ 1న జరగనున్న చిత్తూరు నగరపాలక ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు రెండు వేర్వేరు రంగుల బ్యాలెట్ పత్రాలు ఇస్తారని తెలిపారు.