రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడికి జనసేన అండ.|

0
0

మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ముస్తాఫిర్‌ను మదనపల్లె జనసేన యువ నాయకుడు తోట కళ్యాణ్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్యాడర్ పరామర్శించింది. సహస్ర ఆసుపత్రిలో బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, రూ.15 వేల నగదును తక్షణ సహాయంగా అందజేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, కార్యకర్తలు నరేంద్ర కుమార్, అజయ్ కుమార్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.