మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై షోరూమ్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వాహనాలను అతివేగంగా నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ఉపయోగించాలని సూచించారు.
లేన్ క్రమశిక్షణ పాటించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం, ట్రాఫిక్ నిబంధనలను అనుసరించడం ద్వారా రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జి. శంకర్ రాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, అదనపు ఇన్‌స్పెక్టర్ పి. రమణయ్య, హ్యుందాయ్ షోరూమ్ మేనేజర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌కు దోహదపడతాయని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి మంచి స్పందన లభించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
#Sidhumaroju










