పెద్దపెల్లి మండలంలోని పెదకలువల నుంచి అప్పన్నపేట గ్రామం వరకు నూతనంగా నిర్వహిస్తున్న బైపాస్ రహదారి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఈ మేరకు ఆయన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రయాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో, ఈ బైపాస్ కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.










