
**పెండింగ్ కేసులకు చెక్** **లోక్ అదాలత్‌లో త్వరిత పరిష్కారం సాధ్యం : ఎస్సై వెంకట్రాజం** bharat awaz reporter vemulawada రూరల్ మండల ప్రజలు ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు సమయం, ధనం ఆదా చేసుకోవడంతో పాటు దీర్ఘకాలిక న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలకవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో సంబంధిత ఇరువర్గాలు సహకరించి, పరస్పర అవగాహనతో ముందుకు రావాలని కోరారు. రాజీ పడదగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు తదితర వివాదాలను పరిష్కరించుకోవచ్చని ఎస్సై వెంకట్రాజం తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్‌లో తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా అమలుల