ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ మహేష్|

0
0

*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి గితే…* *bharat awaz reporter vemulawada * ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, మండలంలోని నేర చరిత్ర కలిగిన వారి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు, భద్రతకు ప్రతి గ్రామంలోనూ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వర్ రావు, ఇల్లంతకుంట ఎస్ ఐ సిరిసిల్ల అశోక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.