చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారు ఈ రోజు నూడా చైర్మెన్ కేశవేణు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సర్పంచ్ గారి వినతిపై సానుకూలంగా స్పందించిన నూడా చైర్మెన్ కేశవేణు గారు వెంటనే చర్యలు తీసుకుని, చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలను కేటాయించారు.నందిపేట్ గ్రామ అభివృద్ధి కోసం సహకరించిన నూడా చైర్మెన్ కేశవేణు గారికి సర్పంచ్ ఎర్రం లింగం గారు కృతజ్ఞతలు తెలిపారు.










