ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన,పెట్రోల్ బంకు ఎదురు,వినుకొండ రోడ్డు, నరసరావుపేట,పల్నాడు జిల్లా. సమీపంలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌లో ఈ నెల 21-06-2026 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో గుండె, ఛాతీ, జనరల్ సర్జరీ, దంత వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉచిత ఓపీ, ఈసీజీ, బీపీ చెకప్‌తో పాటు అవసరమైన వారికి రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ పరీక్షలు రాయితీ ధరల్లో అందించనున్నారు. అలాగే 2డీ ఎకో, టీఎంటీ, యాంజియోగ్రామ్, దంత పరీక్షలు, ఇతర వైద్య సేవలపై ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.










