మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
తిరుపతి రూరల్ మండలంలో ఇప్పటికే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్యే గారు.
అందులో భాగంగానే ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోని చెన్నయగుంట చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గారు.
చెరువును సుమారు 41 లక్షలతో సుందరీకరణ తో పాటు ఓపెన్ జిమ్, పిల్లల పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే గారు.
పీడీ, మండల స్థాయి అధికారులతో కలసి … స్వయంగా జెసిబి ని నడిపి చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు
తిరుపతి,
చంద్రగిరి నియోజకవర్గాన్ని మన కూటమి ప్రభుత్వ అధినాయకుల సహాయ సహకారాలతో ఎనలేని అభివృద్ధిని చేసి చూపుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
తిరుపతి రూరల్ మండలంలోని ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో ఉన్న చెన్యయగుంట చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువును అభివృద్ధి చేసి, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు సుమారు 41 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్యయగుంట చెరువు అభివృద్ధితో భూగర్భ జలాల పెరుగుదల, పరిసర ప్రాంతాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు, పిల్లలకు పార్క్ , ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే విహార కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.









