South ZoneTelangana సిరిసిల్ల: మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు| By Bharat Aawaz - 20 June 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL *రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు.* *మద్యం సేవించి పట్టుబడిన 143 మంది మందు బాబులకు జరిమానాలు.* *వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్.* వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకే నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 143 మందు బాబులను ఈరోజు లోక్ అదాలత్ లో భాగంగా వేములవాడ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ మేఘన జరిమానాలు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ తెలిపారు. *విధించిన జరిమానాల వివరాలు.* *1.22 మందికి ఒక్కొక్కరికి ₹4000,రూపాయల జరిమాన.* *2.ఒక్కరికి ₹5000 రూ. జరిమానా* *3.53 మందికి ఒక్కొక్కరికి ₹3000 జరిమానా.* *4. 59 మందికి ఒక్కొక్కరికి 2,000/- రూపాయల జరిమాన.* *5.05 గురికి ఒక్కొక్కరికి 2500-/ రూపాయల జరిమాన.* *6.03 రికి ఒక్కొక్కరికి 3500/- రూపాయల జరిమాన.* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై కుటుంబాలను రోడ్డున పడేయొద్దని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమతో పాటు ఎదురుగా వచ్చే వారి కుటుంబాల్లో కూడా విషాదం నింపవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి కేసుల పలు అయితే భవిష్యత్తులో ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరించారు.అలాగే ట్రాఫిక్ మరియు రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.