ఎర్ర రెడ్డిపాలెం కలెక్టర్ విస్తృత పర్యటన ఉపాధి హామీ పనులపై సమీక్ష|

0
1

“*యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష*”

గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు.

పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా యెర్రారెడ్డిపాలెం గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గారు, శనివారం ఉదయం ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారుతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

డ్వామా అధికారులను పనుల పురోగతి, కూలీలకు వేతనాల చెల్లింపు వివరాలపై ప్రశ్నించి సమీక్షించారు.

గ్రామంలో పాడి పశువుల పాల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా పశువుల దాణాకు అనుబంధంగా ఖనిజ మిశ్రమం (మినరల్ మిక్స్చర్) ప్యాకెట్లను కలెక్టర్ గారు పంపిణీ చేశారు.

“గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని కలెక్టర్ గారు పేర్కొన్నారు.