కర్నూలు జిల్లాలో 68.23 శాతం పోలింగ్ నమోదు సాయంత్రం 5 గంటల వరకు 8,52,335 మంది ఓటు హక్కు వినియోగం – పత్తికొండలో 67.82 శాతం పోలింగ్

0
2

కర్నూలు, నవంబర్ 5: కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో మొత్తం 68.23 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 మండలాల్లో 1,431 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు నిర్వహించారు.

జిల్లాలో మొత్తం 12,49,212 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు 8,52,335 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు 1,63,030 ఓట్లు, 11 గంటలకు 3,92,656 ఓట్లు, మధ్యాహ్నం ఒంటి గంటకు 6,06,748 ఓట్లు, మధ్యాహ్నం 3 గంటలకు 7,53,742 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ శాతం 68.23కు చేరుకుంది.

మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో కల్లూరు మండలం 81.79 శాతంతో అత్యధిక పోలింగ్ నమోదు చేయగా, కోసిగి మండలం 54.44 శాతంతో అత్యల్ప పోలింగ్ నమోదైంది. పత్తికొండ మండలంలో మొత్తం 57,630 మంది ఓటర్లకు గాను 39,087 మంది ఓటు వేయడంతో 67.82 శాతం పోలింగ్ నమోదైంది.

ముఖ్యమైన పోలింగ్ వివరాలు:

జిల్లా మొత్తం పోలింగ్ శాతం: 68.23%

మొత్తం ఓటర్లు: 12,49,212

పోలైన ఓట్లు: 8,52,335

మొత్తం పోలింగ్ కేంద్రాలు: 1,431

అత్యధిక పోలింగ్: కల్లూరు – 81.79%

అత్యల్ప పోలింగ్: కోసిగి – 54.44%

పత్తికొండ పోలింగ్: 67.82% #kammara sureshachari