ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: బహుజన యువసేన.|

0
2

మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని సోమవారం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణలపై రెవెన్యూ, APIIC అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. భూ ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.