మదనపల్లెలో బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్.|

0
2

మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ భీమలింగ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంగయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.