సార్ కార్యక్రమం నిర్లక్ష్యం..6 మంది BLOలకు షోకాజ్ కార్యదర్శి సస్పెన్షన్|

0
1

సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం.. 6 మంది BLOలకు షోకాజ్, కార్యదర్శి సస్పెన్షన్

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ మార్కాపురం మండలం

మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించిన 6 మంది బూత్ లెవల్ అధికారులకు (BLOలు) జిల్లా కలెక్టర్ విజయసునీత షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని పెద్దారవీడు మండలం రామాయపాలెం పంచాయతీ కార్యదర్శి ఎస్. శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని, ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.